ETV Bharat / state

బీసీలకు రాజ్యాధికారం రావాలి: వీహెచ్​ - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

బీసీలు రాజ్యాధికారం చేపట్టాలని కాంగ్రెస్​ నేత వి. హనుమంతరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్‌నగర్​లో జరిగిన మున్నూరుకాపు సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

congress leader v hanumanth rao on bc's in politics
బీసీలకే రాజ్యాధికారం రావాలి: వీహెచ్​
author img

By

Published : Dec 30, 2020, 6:09 PM IST

రాష్ట్ర జనాభాలో 54 శాతం ఉన్న బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడాలని కాంగ్రెస్​ నేత వి. హనుమంతరావు సుచించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్‌నగర్​లో జరిగిన మున్నూరుకాపు సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అందరు ఐక్యంగా ఉండి ఎన్నికల్లో గెలిచే విధంగా కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో అగ్రకులాల పెత్తనం కొనసాగుతుందన్నారు. బీసీలు సంపాదించిన డబ్బులు.. అగ్రకులాల వారు ఎన్నికల్లో పోటిచేస్తే.. వారికి ఖర్చు చేస్తారని అన్నారు.

బీసీలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. తను యూనివర్సిటీలో చదివే రోజుల్లో కులాలపేర్లు చెప్పేవారు కాదన్నారు. ఇప్పడు ప్రతి ఒక్కరు కులాల పేరు చెప్పుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకులతోపాటు వీహెచ్ హనుమంతరావుకు కాంగ్రెస్​ నేత గాలి అనిల్‌కుమార్‌ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

ఇదీ చదవండి: స్థానికులెవరికీ యూకే స్ట్రెయిన్​ రాలేదు: హెల్త్‌ డైరెక్టర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.