ETV Bharat / state

'ఆక్రమణలు తొలగించండి... చెరువులను కాపాడండి' - greatar

చెరువుల ఆక్రమణలు తొలగించి వాటిని పరిరక్షించే విధంగా వివిధ శాఖల అధికారులతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు సమీక్ష నిర్వహించారు. ఆక్రమణలు తొలగించడమే కాకుండా... గొలుసుకట్టు కాలువలను ప్రక్షాళన చేసి యథావిధిగా నీరు పోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్‌ సమీక్ష
author img

By

Published : Jun 20, 2019, 3:24 PM IST

సంగారెడ్డి జిల్లా అమీపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో రెవిన్యూ, హెచ్‌ఎండీఏ, పురపాలక, ఇరిగేషన్‌, గ్రేటర్‌, ఎస్పీఎఫ్‌ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు సమీక్ష నిర్వహించారు. చెరువుల పరిరక్షణకోసం బఫర్‌జోన్‌, ఎఫ్టీఎల్‌ ప్రాంతాలను గుర్తించేందుకు వీలుగా మ్యాప్‌లను తయారుచేయాలని సూచించారు. పెద్దచెరువుల ఆక్రమణలను తొలగించి... ఆక్రమించిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. చెరువులు, కుంటలపై రెవిన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు సంయుక్తంగా రూట్​ మ్యాప్‌ను తయారుచేయాలని కలెక్టర్ అన్నారు.

జిల్లా కలెక్టర్‌ సమీక్ష

ఇవీ చూడండి: వైరల్​: పూజ చేస్తుండగా చీరకు నిప్పు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.