వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపుర క్షేత్రాన్ని జిల్లా పాలనాధికారి హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.
ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: ''కేసునమోదుకు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదు"