CM KCR at Jahirabad Praja Ashirvada Sabha : ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉండే వజ్రాయుధం ఓటు.. ప్రజలు దాన్ని రాయి ఏదో.. రత్నం ఏదో గుర్తుపట్టి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా జహీరాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మన దేశంలో రావాల్సినంత పరిణతి రాలేదని తెలిపారు. యూరప్ దేశాల్లో ఎన్నికల బహిరంగ సభలు జరగవని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలన చూసి, టీవీల్లో నేతలు చెప్పేది విని ప్రజలు నిర్ణయానికి వస్తారని చెప్పారు. ప్రజలు ఓట్లు వేసే ముందు బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలని సూచించారు. ఆయా పార్టీలు అధికారంలోకి వస్తే ఏం చేస్తాయో ఆలోచించి ముందడుగు వేయాలని వివరించారు.
జాగ్రత్తగా ఓటు వేయకుంటే చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది : కేసీఆర్
CM KCR at Patancheru Praja Ashirvada Sabha : బీఆర్ఎస్(BRS) పుట్టిందే ప్రజల కోసమని.. తెలంగాణ హక్కుల కోసమని సీఎం కేసీఆర్ (KCR) అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. పటాన్చెరు ప్రాంతంలో కాలుష్యం లేని ఐటీ పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు కరెంట్ సరిగా ఉండేది కాదన్నారు. పటాన్చెరు ప్రాంతాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు దిల్లీ గులాములు కాదని చెప్పారు.
పేదల భూములు గుంజుకునేందుకే ధరణి తీసుకొచ్చారు : జేపీ నడ్డా
"బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాసులు, మాకు ఏదైనా చెప్పేది ప్రజలే. బీఆర్ఎస్ (BRS) మళ్లీ గెలిస్తే.. పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాం.హైదరాబాద్ చుట్టూ కొత్తగా 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌కు ఎన్నో విదేశీ కంపెనీలు వస్తున్నాయి. తలసరి ఆదాయంలో తెలంగాణ ఇవాళ నంబర్ వన్‌గా ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. అసైన్డ్ భూములు లాక్కుంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. అసైన్డ్ భూములపై రైతులకు పూర్తిస్థాయిలో హక్కులు కల్పిస్తాం." - కేసీఆర్, ముఖ్యమంత్రి
తెలంగాణకు కాళేశ్వరం కల్పతరువు - రాజకీయాల కోసం బద్నాం చేయొద్దు : కేటీఆర్
కరోనా సమయంలో వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఆ సమయంలో ఉత్తరాది కార్మికులు వెళ్లేందుకు రైళ్లు నడపాలని ప్రధాని మోదీని (Narendra Modi) కోరామన్నారు. కానీ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఆనాడు మోదీ ఒప్పుకోలేదని ఆరోపించారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వలస కార్మికులకు భోజన వసతి కల్పించి అండగా నిలిచిందని గుర్తు చేశారు.
హైదరాబాద్ అభివృద్ధితో బీఆర్ఎస్కు మంచి స్పందన వస్తోంది: కాలేరు వెంకటేశ్