మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చెండూరు గ్రామానికి చెందిన సంతోశ్ అనే వ్యక్తి నాలుగేళ్ల కుమారుడు తరుణ్ తేజ్ కొంతకాలం నుంచి బ్లడ్ కాన్సర్తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కూల్ గ్రామ సర్పంచ్ నీలం మధు బాలుడి చికిత్స కోసం సాయం అందించారు. తరుణ్ తేజ్ తండ్రి సంతోశ్కు రూ.2 లక్షలు అందజేశారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలోనే సంతృప్తి ఉంటుందని మధు అన్నారు. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.