ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులకు.. ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా ఎస్సీ మోర్చా నాయకులు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం జరిగే కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ నేతలు మండిపడ్డారు. గెలవక ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భాజపా కిసాన్ మోర్చా ధర్నా