సంగారెడ్డిలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ శివారులోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా.. ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూతన వస్త్రాలు ధరించి.. చిన్న, పెద్ద అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని.. ఒకరికొకరు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అక్కడి ముస్లిం సోదరులు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇదీ చూడండి: 'రెండు అరటిపండ్లు'-తాజా వ్యాపార ప్రచారాస్త్రం