సంగారెడ్డి కలెక్టరేట్లో కరోనా వైరస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంఎన్ఆర్ హోమియోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో వైరస్ నివారణ మాత్రలు పంపిణీ చేశారు. వైరస్ వ్యాప్తి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచించారు. ఆసుపత్రిలో 25 పడకల ఐపీడీ ఉందన్నారు. రోగులకు ఉచితంగా మాత్రలు, వసతి, భోజనం కల్పిస్తున్నామని నిర్వాహకులు సుమన్ తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణ నేలపై డైనోసార్లు