ETV Bharat / state

'స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా చూడండి' - ankenapalli Sarpanch latest news

తమ పంచాయతీ పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చూడాలని అంకెనపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్​లు జిల్లా రెవెన్యూ అధికారిని కలిశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.​

ankenapalli Sarpanch handing over the petition to the District Revenue Officer
'స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా చూడండి'
author img

By

Published : Jan 25, 2021, 3:52 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అంకెనపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఉప సర్పంచ్​ మల్లేశం కలెక్టరేట్​లో జిల్లా రెవెన్యూ అధికారిణి రాధికా రమణిని కలిశారు. తమ పంచాయతీ పరిధిలోని పెన్నార్, ఎంఆర్ఎఫ్ పరిశ్రమల్లో స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు యువతతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

తమ గ్రామ యువతకు ఉద్యోగాలు కల్పించాలని పెన్నార్ పరిశ్రమకు వెళితే.. యాజమాన్యం స్పందించలేదని సర్పంచ్​ విజయలక్ష్మి పేర్కొన్నారు. అధికారులు స్పందించి.. వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కరోనా కష్టకాలంలో నిరుద్యోగులకు అండగా నిలవాలన్నారు.

ఇదీ చూడండి: సర్పంచ్​గా పోటీ చేసేందుకు.. అర్హతలు.. అనర్హతలు ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.