సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని మన గ్రోమోర్ కేంద్రంలో సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పంపిణీ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులను కొని మోసపోవద్దని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం మన గ్రోమోర్ కేంద్రంలో ఆయన కలియతిరిగారు.
అక్కడ విక్రయిస్తున్న ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలను పరిశీలించారు. వాటి ధరలు, నాణ్యత తదితర అంశాలను కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్పర్సన్ మంజు శ్రీ, ఎంపీపీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.