ETV Bharat / state

పొలం ఒడిలో పుట్టి పెరిగింది... సాగుబడిలో ప్రతిభ చూపుతోంది - తెలంగాణ తాజా వార్తలు

అమ్మానాన్నల కష్టాల్ని కళ్లారా చూసింది. ఓ రైతు ఎంత శ్రమపడితే పంట చేతికొస్తుందో దగ్గరగా గమనించింది. ఆరుగాలం శ్రమించి.. వేల రూపాయలు వెచ్చించిన అన్నదాతకు చివరికి కన్నీరే మిగులుతుండటం ఆమెను కలచివేసింది. ఈ సమస్యకు రైతు బిడ్డగా తనే పరిష్కారం కనిపెట్టాలనుకుంది. తన చదువును ఆ దిశగా మళ్లించుకుంది. అందులో అపార ప్రతిభ చాటి మూడు బంగారు పతకాలు సాధించింది. తనే పద్మశ్రీ. ఆమె ఆలోచనలను ‘వసుంధర’తో పంచుకుంది..

Telangana
sangareddy
author img

By

Published : Apr 26, 2021, 8:42 AM IST

అన్నదాత కన్నీరు తుడవాలని...
పద్మశ్రీ

పద్మశ్రీ స్వస్థలం సంగారెడ్డి. నాన్న కల్వ పుల్లారెడ్డి క్రాప్స్‌ నర్సరీ రైతు. కూరగాయల నారు విక్రయిస్తారు. అమ్మ సరళ. తనకో తమ్ముడు. ఆ కుటుంబానికి నర్సరీనే ఆధారం. వ్యవసాయంలో ఒడుదొడుకులు నర్సరీ మీదా ప్రభావం చూపుతూ ఉంటాయి. అవన్నీ దగ్గరగా చూసిన పద్మశ్రీ... రైతు సమస్యలకు పరిష్కారం చూపించాలనుకుంది.

పతకాల సాగు!:

ఇంటర్‌లో 980 మార్కులు తెచ్చుకుంది. తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో రుద్రూర్‌ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాలలో బీటెక్‌లో చేరింది. తన అకడమిక్స్‌లోనూ రైతు సమస్యలకు పరిష్కారం చూపించే ప్రాజెక్టును ఎంచుకుంది. టొమాటోలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఏం చేయొచ్చనేదే ఈ ప్రాజెక్టు. టొమాటోలకు రొయ్యపొట్టు, అలోవెరా తదితర పదార్థాలతో కోటింగ్‌ వేస్తే సుమారు నలభై ఐదు రోజుల వరకూ నిల్వ ఉంచొచ్చని రుజువు చేశారు. ముగ్గురు బృందంగా ఏర్పడి చేసిన ఈ ప్రయోగానికి ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఎ-ఐడియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన పోటీల్లో దక్షిణ భారతదేశంలోనే ‘బెస్ట్‌ ప్రాజెక్టు ఐడియా’గా గుర్తింపు పొందింది. ఇదే కాదు... చదువులో రాణిస్తోంది. జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి ‘అవుట్‌ స్టాండింగ్‌ గోల్డ్‌ మెడల్‌’ను సొంతం చేసుకుంది పద్మశ్రీ. ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాలలో చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. మంచి గ్రేడ్‌ సాధించడంతో రెండు బంగారు పతకాలను అందుకుంది.

మహిళల ఎదుగుదలే లక్ష్యం

ప్రస్తుతం తమిళనాడులోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ)’లో ఎంటెక్‌ చదువుతోంది పద్మశ్రీ. ఇదయ్యాక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెట్టాలన్నది తన లక్ష్యం. వివిధ పంట ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి ఎక్కువ కాలం నిల్వచేసే సాంకేతికతలను అభివృద్ధి చేయడం, వాటికి సంబంధించిన సంస్థను స్థాపించడం తన ఉద్దేశం. ‘‘ప్రాసెసింగ్‌ యూనిట్‌లను పల్లెలకూ విస్తరించాలి, వాటి గురించి గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించాలి. అప్పుడు మహిళలు ఆర్థికంగా ఎదుగుతారు, రైతులూ లాభపడతారు’’ అని చెబుతోంది పద్మశ్రీ. ఇందుకు అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పటి నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కాన్ఫరెన్సుల్లో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వర్క్‌షాపుల్లోనూ పాల్గొంటోంది. పెయింటింగ్స్‌ వేయడం తన హాబీ. ఒత్తిడి నివారణకు నాకిదో ఔషధం అని వివరించింది తను.‘‘ప్రతి అమ్మాయికీ ఒక లక్ష్యం ఉండాలి. ఒక్కొక్క సమయంలో సపోర్ట్‌ ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అయినా లక్ష్యాన్ని వీడకూడదు. ఎంత కష్టమైనా పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాన్ని సాధించవచ్చు’’ అంటోంది పద్మశ్రీ.

ఇదీ చూడండి: ఆమె గురించి ఆలోచించండి.. ఆమెతో కాస్త సమయం గడపండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.