ETV Bharat / state

అప్పుడు తల్లిని కోల్పోయి.. ఇప్పుడు అమెరికా దంపతులకు ఆత్మీయ కుమారుడై.! - American couple adopted a Telugu boy

రెండేళ్ల క్రితం ఆ పసివాడి విషయంలో తీరని అన్యాయమే జరిగింది. ముక్కుపచ్చలారని వయసులో ఎనలేని శోకాన్ని మూటగట్టుకున్నాడు. తల్లిదండ్రుల ఒడిలో American Couple adopted a Telugu Boy: హాయిగా పెరుగుతూ... దెబ్బ తగిలితే తప్ప ఏడవడం తెలియని ఆ చిన్నారికి గుండెలవిసే బాధ కలిగింది. మూడేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయి.. అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. బాధ్యత మరిచిన కన్న తండ్రి అంతకుముందే వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆపద్బాంధవుడిలా శిశు సంరక్షణ అధికారులు ఆదుకున్నారు. ఇంతలోనే మాయదారి రోగం ఆ చిన్నారిని వెంటాడింది. ఎలా అనుకొని బాధపడుతుండగా.. ఆ పసివాడి జీవితంలో ఊహించని అద్భుతం జరిగింది. అదేంటంటే..

American couple adopted a Telugu boy
అనాథ బాలుడికి అమెరికా దంపతుల అండ
author img

By

Published : May 6, 2022, 4:25 PM IST

American Couple adopted a Telugu Boy: మూడేళ్ల వయసులోనే అమ్మ చనిపోయింది. అప్పటికే నాన్న ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇక తనకంటూ ఎవరూ లేరు. బంధువులు ఉన్నా... కరోనా సమయం కావడంతో అక్కున చేర్చుకోవడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. అమ్మ మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తున్న దృశ్యం అందరినీ కలచివేసింది. కరోనా లాక్‌డౌన్‌ సమయం కావడంతో ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయత నెలకొంది. దీంతో ఆ బాలుడి పట్ల శిశుసంరక్షణ అధికారులే సంరక్షకులయ్యారు. రెండేళ్ల క్రితం ఈ స్థితిలో ఉన్న బాలుడిని సంగారెడ్డి శిశుగృహ అధికారులు అక్కున చేర్చుకున్నారు. మౌలిక అవసరాలు తీరుస్తూ.. సమయానికి పౌష్టికాహారం అందిస్తున్నారు.

American couple adopted a Telugu boy
సంగారెడ్డిలోని శిశుగృహలో దత్తపుత్రుడితో అమెరికాకు చెందిన దంపతులు

కానీ కష్టాలు అతని వెన్నంటే ఉన్నట్లుగా.. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో ఆ బాలుడికి దీర్ఘకాలిక జబ్బు ఉన్నట్లు బయటపడింది. అయినా అధికారులు వైద్యం చేయిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాలుడికి ఆపద్బాంధవుడిలా మరో పెద్ద అండ దొరికింది. తల్లిదండ్రుల ఆప్యాయత కరవై అనాథలా బతుకుతున్న ఆ చిన్నారికి.. మానవత్వం కలిగిన ఆ దంపతుల రూపంలో మళ్లీ ఆ ఆప్యాయతకు దగ్గరయ్యాడు. దేవుడు మన దగ్గర నుంచి కొన్ని తీసుకుంటే.. అందుకు రెట్టింపుగా మనకు ఇస్తాడు అనేదానికి ఈ బాలుడి జీవితమే ఉదాహరణ.

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను దత్తత తీసుకోవాలని చూస్తున్న అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు స్టీఫెన్‌ పాట్రిక్‌ బెర్గిన్‌ సంబంధిత ఏజెన్సీల నుంచి వివరాలు సేకరించి ఈ బాలుడిని ఎంచుకున్నారు. దత్తత తీసుకోవడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తిచేశారు. ఆమోదం లభించినప్పటి నుంచి ఆ బాలుడితో వీడియోకాల్‌లో మాట్లాడుతున్నారు. మందులతో పాటు బొమ్మలూ పంపుతూ అనుబంధం పెంచుకున్నారు. గురువారం బాలుడిని తీసుకెళ్లడానికి తన భార్య ఎరిన్‌ లిన్‌ బెర్గిన్‌తో కలిసి వచ్చారు. వారిని చూడగానే బాలుడు అమ్మానాన్నా అంటూ వెళ్లి వారిని హత్తుకున్నాడు. ఆ సన్నివేశం అక్కడున్న వారందరికీ ఆనందబాష్పాలను కలిగించింది. అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా, జిల్లా సంక్షేమాధికారిణి పద్మావతి సమక్షంలో దత్తత పత్రాలు అందుకున్న ఈ దంపతులు తమతో పాటు బాలుడిని అమెరికా తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈ బాలుడిని దత్తత తీసుకునేందుకు ముందుకు రావడం విశేషం.

ఇవీ చదవండి: 'ఈ నెల 12 నుంచి రోగుల సహాయకులకూ ఉచిత భోజనం'

కేటీఆర్​, కవిత ట్వీట్​లకు రేవంత్​ కౌంటర్.. ​ఏమన్నారంటే..?

ఎల్​ఐసీ ఐపీఓకు భారీ స్పందన.. రిటైల్​లో 100% సబ్​స్క్రిప్షన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.