ETV Bharat / state

తండ్రి కోసం గళం విప్పిన హిమాన్షు - మురిసిపోయిన కేటీఆర్​ - KTR SON HIMANSHU SONG VIRAL

తండ్రి కోసం పాట పాడిన కేటీఆర్​ కుమారుడు హిమాన్షు - వీడియోను ఎక్స్​లో ట్వీట్​ చేసిన కేటీఆర్​ - తండ్రిగా చాలా గర్వపడుతున్నానంటూ ట్వీట్

KTR Son Himanshu Rao Song
KTR Son Himanshu Rao Song (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2024, 5:28 PM IST

Updated : Dec 28, 2024, 5:59 PM IST

KTR Son Himanshu Rao Song : 'నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే.. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా నువ్వే కదా.. సితార నా కలకి. నా నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట ఆ మాట. నా నానీకై ప్రాణం ఇవనూ.. ఇదిగో ఇది నా మాట.' అంటూ బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ మనవడు, కేటీఆర్​ కుమారుడు హిమాన్షు రావు యానిమల్​ సినిమాలోని పాటను ఆలపించారు. ఆ పాట ద్వారా తన నాన్నపై ఉన్న ప్రేమ, గౌరవాన్ని చూపించారు. తనతో ఉన్న జ్ఞాపకాలను ఫొటోల రూపంలో ప్లే చేస్తూ హిమాన్షు సొంతంగా గానం చేశారు. ఈ వీడియో కేటీఆర్​ మాటలు ప్రకారం చూస్తే ఈ ఏడాది జులైలో పుట్టినరోజు సందర్భంగా చేసి హిమాన్షు చేసి ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతుంది.

కేటీఆర్​ ట్వీట్​ : ఇప్పుడు ఈ వీడియోను కేటీఆర్​ ఎక్స్​ వేదికగా పోస్టు చేశారు. తన సంతోషాన్ని ట్వీట్​ రూపంలో షేర్​ చేసుకున్నారు. "కష్టతరమైన సంవత్సరంలో నాకు లభించిన ఉత్తమ బహుమతి. ధన్యవాదాలు బింకు @TheHimanshuRaoK. నీ గానం నాకు చాలా నచ్చింది. జులైలో నా పుట్టినరోజు కోసం నా కుమారుడు దీన్ని రికార్డు చేసినట్లు తెలుస్తోంది. కానీ అది సరిపోదని భావించి విడుదల చేయకుండా తప్పించుకున్నాడు. నేను గత వారం మాత్రమే మొదటిసారి విన్నాను. తండ్రిగా చాలా గర్వంగా ఉంది" అంటూ ఎక్స్​ వేదికగా వీడియోతో పాటు ట్వీట్​ చేశారు.

గతేడాది ఓ ఇంగ్లీష్​ సాంగ్​ పాడిన హిమాన్షు : ఇప్పటికే కేటీఆర్​ కుమారుడు వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో తన టాలెంట్​తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే గతేడాది ఓ ఇంగ్లీష్​ సాంగ్​(గోల్డెన్​ అవర్​)ను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా ఇప్పుడు ఇలా తన తండ్రిపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని పాట రూపంలో పాడి వినిపించాడు. ఇవే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేయడంలో హిమాన్షు ముందు వరుసలో ఉన్నాడు.

KTR Son Himanshu Speech : 'కేసీఆర్‌ మనవడా మజాకా.. ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ అదరగొట్టేశాడుగా..'

Himanshu Kalvakuntla : సోషల్ మీడియాలో కేటీఆర్ తనయుడు హిమాన్షు సాంగ్ వైరల్

Last Updated : Dec 28, 2024, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.