Acb Raids On MPO Officer: సంగారెడ్డి మండల పంచాయతీరాజ్ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఎంపీఓ సురేందర్ రెడ్డి ఇంట్లో రూ. 2కోట్ల 31లక్షల విలువైన ఆస్తులను... అవినీతి నిరోధకశాఖ అధికారులు గుర్తించారు. రూ. 43లక్షల 79వేల విలువైన 4ఓపెన్ ప్లాట్లు, రూ. 8లక్షల విలువైన వ్యవసాయ భూముల దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో 190 తులాల బంగారం, రూ. 4లక్షల 22వేల నగదును ఏసీబీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
రెండేళ్లపాటు శంషాబాద్‌లో పనిచేసిన సురేందర్ రెడ్డి... అక్కడే బాగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డికి బదిలీ అయిన తర్వాత... అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయినట్లు వెల్లడించారు. ఈ కేసులో బినామీలు ఇతర వివరాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
ఇవీ చూడండి: