పట్టాదారు పాసుపుస్తకం జారీ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా మోగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన రైతు అశోక్‌రెడ్డి పట్టాదారు పాసు పుస్తకం కోసం మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అది ఇవ్వడానికి వీఆర్వో అయూబ్ అబ్దుల్ రూ. 15వేలు లంచం డిమాండ్ చేశాడు. రైతు అనిశా అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం రైతు 15 వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. లంచం తీసుకుంటుండగా అధికారులు మాటు వేసి వీఆర్వోను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా అనిశా డీఎస్పీ రవికుమార్ తెలిపారు.
లంచం తీసుకున్నాడు.. అనిశా వలలో చిక్కాడు..
సంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు మాటు వేసి పట్టాపుస్తకం జారీ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు.