ETV Bharat / state

డీఎన్‌ఏను బాగుచేయడం సాధ్యం : ఐఐటీ హైదరాబాద్‌

ప్రతి జీవిలోనూ డీఎన్ఏ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాల ప్రభావంతో డీఎన్ఏ నిర్మాణం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో తిరిగి బాగు చేసే వ్యవస్థను ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు కనుక్కున్నారు.

Unable to repair DNA IIT Hyderabad
డీఎన్‌ఏను బాగుచేయడం సాధ్యం : ఐఐటీ హైదరాబాద్‌
author img

By

Published : Dec 27, 2019, 12:47 PM IST

ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు డీఎన్ఏను తిరిగి బాగు చేసే వ్యవస్థ గుట్టు విప్పారు. డీమిథైలైజేషన్‌ ప్రక్రియ ద్వారా ఏఎల్‌కేబీహెచ్‌3 ప్రొటీన్‌ దెబ్బతిన్న డీఎన్‌ఏను మరమ్మత్తు చేస్తుందని వీరు గుర్తించారు. ఇది ఆర్‌ఏడీ51సీ అనే మరో ప్రొటీన్‌తో కలిసి పనిచేస్తుందని వీరి పరిశోధనలో తేలింది. ఈ రెండు ప్రొటీన్లు కలవడం వల్ల డీఎన్‌ఏను బాగుచేయడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు.

ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ గువాహటికి చెందిన ఆచార్యులు డాక్టర్‌ అనింద్యారాయ్‌, డాక్టర్‌ అరుణ్‌ గోయల్‌ సారధ్యంలోని బృందం ఈ పరిశోధన చేసింది. ఈ బృందం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కి మెరుగైన చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తెచ్చే అంశమై గత కొంతకాలంగా పరిశోధనలు చేస్తోంది.

డీఎన్‌ఏను బాగుచేయడం సాధ్యం : ఐఐటీ హైదరాబాద్‌

ఇదీ చూడండి : కోర్టులో సాయికుమార్​గౌడ్​పై నేరాభియోగపత్రం దాఖలు

Tg_srd_01_27_iit_dna_ab_3180660 రిపోర్టర్: క్రాంతికుమార్, స్టాఫర్ () ప్రతి జీవిలోనూ డీఎన్ఏ ది కీలక పాత్ర. శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాల ప్రభావంతో డీఎన్ఏ నిర్మాణం దెబ్బతింటుంది. తిరిగి బాగు చేసే వ్యవస్థ కూడా సహజసిద్ధంగా శరీరంలో ఉంటుంది. ప్రోటీన్లు ఈ పని చేస్తాయి. ఈ ప్రక్రియను తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ఈ గుట్టు విప్పారు. డీమిథలైజేషన్‌ ప్రక్రియ ద్వారా ఏఎల్‌కేబీహెచ్‌3 ప్రొటీన్‌ దెబ్బతిన్న డీఎన్‌ఏను మరమ్మతు చేస్తుందని వీరు గుర్తించారు. ఇది ఆర్‌ఏడీ51సీ అనే మరో ప్రొటీన్‌తో కలిసి ఈ పనిచేస్తుందని వీరి పరిశోధనలో తేలింది. ఈ రెండు ప్రొటీన్లు కలవడం వల్ల డీఎన్‌ఏను బాగుచేయడం సాధ్యమవుతోంది. ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ గువాహటికి చెందిన ఆచార్యులు డాక్టర్‌ అనింద్యా రాయ్‌, డాక్టర్‌ అరుణ్‌గోయల్‌ సారధ్యంలోని బృందం పరిశోధన చేసింది. ఈ బృందం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కి మెరుగైన చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తెచ్చే అంశమై గత కొంతకాలంగా పరిశోధనలు చేస్తోంది.....VIS
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.