వరంగల్ పోలీస్ కమిషనరేట్ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 27న యువతిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సాయికుమార్ గౌడ్‌పై పోలీసులు నేరాభియోగపత్రం దాఖలు చేశారు. యువతి సోదరుడి ఫిర్యాదుతో గత నెల 28న సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పలు కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు.. పూర్తి సాక్ష్యాలతో కోర్టులో నేరాభియోగ పత్రం దాఖలు చేశారు.
ఎఫ్ఎస్ఎల్ నివేదిక, డీఎన్ఏ పరీక్ష, పలువురు సాక్ష్యుల వాగ్మూలం సేకరించిన పోలీసులు అన్నింటినీ క్రోడీకరించి ఘటన జరిగిన నెల రోజుల్లోనే నేరాభియోగ పత్రం దాఖలు చేయడం విశేషం. హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి పర్యవేక్షణలో సుబేదారి ఇన్స్పెక్టర్ అజయ్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నేరాభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు.
ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'