ETV Bharat / state

నాలుగోసారి సెల్​ టవర్​ ఎక్కిన కంది వాసి - కందిలో సెల్​ టవర్​ ఎక్కిన వ్యక్తి

కుటుంబ సమస్యలతో సెల్​ టవర్​ ఎక్కిన ఓ వ్యక్తి స్థానికంగా కలకలం సృష్టించాడు. సంగారెడ్డి జిల్లాలోని కంది తహసీల్దార్​ కార్యాలయ ప్రాంగణంలోని టవర్​ ఎక్కి నిరసన తెలిపాడు. ఆస్తి మొత్తం తన అన్ననే అనుభవిస్తున్నాడని.. అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. అతను ఇలా టవర్​ ఎక్కడం ఇది నాలుగోసారి..

cell tower, kandi, sangareddy
సెల్​టవర్​, సంగారెడ్డి, కంది మండలం
author img

By

Published : Jan 3, 2021, 10:23 AM IST

సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి వరుసగా నాలుగోసారి సెల్ టవర్ ఎక్కాడు. కంది మండల కేంద్రానికి చెందిన కాశీపురం ఆంజనేయులు.. శనివారం రాత్రి తహసీల్దారు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సెల్​ఫోన్ టవర్​ ఎక్కాడు. ఆంజనేయులు టవర్ ఎక్కడాన్ని గుర్తించిన రాత్రి కాపలాదారు.. తహసీల్దార్ పరమేశ్వర్​కు సమాచారం ఇచ్చాడు. అనంతరం పరమేశ్వర్, పోలీసులు, రెవెన్యూ అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు. డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సుమారు గంట సమయం తర్వాత ఆంజనేయులు కిందికి దిగాడు.

కుటుంబ సమస్యల వల్లే టవర్ ఎక్కానని ఆంజనేయులు పోలీసులకు తెలిపాడు. తన అమ్మానాన్న చనిపోయారని.. వారసత్వంగా సంక్రమించిన ఆస్తినంతా తన అన్ననే అనుభవిస్తున్నాడని వివరించాడు. తనకు భార్యాపిల్లలు ఉన్నారని, న్యాయం చేయాలని కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఈ ఘటనపై స్పందించిన తహసీల్దార్​.. అన్నదమ్ములు అంగీకారానికి వస్తే వారి పేరు మీద వ్యవసాయ భూమి మార్చుతామని స్పష్టం చేశారు.

సెల్​టవర్​, సంగారెడ్డి, కంది మండలం

ఇదీ చదవండి: పాదచారి.. వంతెన’ ఎక్కేదెప్పుడో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.