ETV Bharat / state

కరోనా కట్టడికి.. ఆ పట్టణంలో 10 రోజుల స్వచ్ఛంద లాక్​డౌన్​.. - Sangareddy District news

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు సంగారెడ్డి జిల్లా జహిరాాబాద్​ వాసులు స్వచ్ఛంద లాక్​డౌన్​ నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 10రోజుల వరకు అన్ని దుకాణాలు మూసివేసేందుకు నిర్ణయించారు.

10 days voluntary lockdown in Zahirabad, Sangareddy District
కరోనా కట్టడికి.. ఆ పట్టణంలో 10 రోజుల స్వచ్ఛంద లాక్​డౌన్​..
author img

By

Published : Jul 17, 2020, 1:47 PM IST

కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. వైరస్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో స్వచ్ఛంద లాక్​డౌన్​ నిర్వహిస్తున్నారు. నేటి నుంచి పది రోజుల పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు సహా నిత్యవసర దుకాణాలను సైతం పూర్తిగా మూసి వేసేందుకు వ్యాపారుల సమాఖ్య ప్రతినిధులు నిర్ణయించారు.

స్వచ్ఛంద లాక్​డౌన్​తో జహీరాబాద్​లో దుకాణాలు మూతపడ్డాయి. పట్టణంలో ప్రధానమైన భవాని మందిర్​ కూడలి, బ్లాక్​రోడ్​, ప్రధాన రోడ్డు నిర్మానుష్యంగా మారింది. పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న లాక్​డౌన్​కు సహకరించాలని మున్సిపల్​, పోలీసు అధికారులు ప్రజలకు సూచనలు చేస్తూ.. గస్తీ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్​లో ప్రయాణికులు లేక... వెలవెలబోతోంది.

ఇదీ చదవండి: గాలి ద్వారా కరోనా.. అడ్డుకోవడం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.