ప్రజలకు అందుబాటులో ఉంటా..నన్ను గెలిపించండి : రంజిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని పలు గ్రామాల్లో చేవెళ్ల తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, కార్యకర్తలతో కలిసి చెన్గోముల్, కంకల్ గ్రామాల్లో పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం ఒక్కటే తన లక్ష్యమన్నారు.తాను ఇచ్చిన హామీల విషయంలో విఫలమైతే మరోసారి ఓట్లు అడగబోనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలే తెరాసకు 16 స్థానాల్లో విజయాన్ని అందిస్తాయని తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలు తీర్చటంలో కొండా విశ్వేశర్ రెడ్డి విఫలమైయ్యారని ఆరోపించారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి :కేంద్రం, ఈసీకి 'కోర్టు ధిక్కరణ' నోటీసులు