మద్యం మత్తులో ఉన్న భార్య.. తన భర్తను కత్తితో పొడిచి చంపింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. తీవ్రగాయాలపాలైన భర్త విశాల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు.
గుండెల్లో పొడిచింది..
ఉత్తరాఖండ్‌కు చెందిన విశాల్, సబీనా గతంలో ఆర్మీలో పనిచేసి.. రిటైర్ అయ్యారు. అనంతరం బండ్లగూడ సన్సిటీలోని మాపిల్టౌన్ విల్లాస్‌లో నివాసం ఏర్పాటుచేసుకున్నారు. ఆర్మీలో రిటైర్మెంట్ అనంతరం సబీనా వైద్యురాలిగా.. విశాల్ ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు.
గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ప్రారంభమైనట్లు సమాచారం. శనివారం రాత్రి వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం మాటామాటా పెరిగి.. మళ్లీ గొడవకు దిగారు. కోపోద్రిక్తురాలైన సబీనా.. ఇంట్లో ఉన్న కత్తితో భర్త గుండెల్లో పొడిచింది. తీవ్రగాయాలపాలైన విశాల్.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. వీరిద్దరిదీ రెండో వివాహమే.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకొని సబీనాను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.