కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఎవరికి వాళ్లే స్వీయ నిర్బంధం చేసుకునే వాళ్లు కొందరైతే... ఊరు దాటి పోకుండా.. వేరే ఊరోళ్లు తమ గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకునే వాళ్లు ఇంకొందరు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తారామతిపేట్, మజీద్‌పూర్ గ్రామాల ప్రజలు వేరే ఊళ్ల నుంచి తమ గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై ముళ్ల కంపలు అడ్డుపెట్టారు.