ETV Bharat / state

vice presidents: 'ఉద్దేశపూర్వకంగానే తమను సస్పెండ్ చేస్తున్నారు' - ఉపసర్పంచ్​ల సంఘం

అవిశ్వాస తీర్మానం పేరుతో తమను ఉద్దేశపూర్వకంగా సస్పెండ్​ చేస్తున్నారని ఉపసర్పంచ్​ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ ఆరోపించారు. ఉపసర్పంచ్​లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలంటూ హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని కన్వెన్షన్​ హాల్​లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

vice presidents union meeting
vice presidents union meeting
author img

By

Published : Jul 5, 2021, 10:57 PM IST

రాష్ట్రంలోని ఉపసర్పంచ్​లకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని ఓ కన్వెన్షన్ హాల్​లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తమను ఉద్దేశపూర్వకంగా సస్పెండ్​ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ఉపసర్పంచ్​ల సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేవలం పేరుకే మాత్రమే ఉపసర్పంచ్​లకు చెక్ పవర్ ఉందన్నారు. చెక్ సంతకాలు పెట్టిన, పెట్టకపోయిన కలెక్టర్లు సస్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ అవార్డ్ అందుకున్న ఉపసర్పంచ్​లను కూడా అవిశ్వాస తీర్మానం పేరుతో సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు.

గ్రామ పంచాయతీ నిధుల తీర్మానంపై ఉపసర్పంచ్​ల సంతకం ఉండాలని ఆయన కోరారు. సర్పంచ్​లకు ఇచ్చిన మాదిరిగా మాకు కూడా కనీసం గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో సెక్రెటరీ, మహిళ సర్పంచ్ భర్తల పెత్తనం నడుస్తోందని వాటిని నియంత్రించాలన్నారు. కొన్ని జిల్లాలో గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో శిలాఫలకాల్లో ఉపసర్పంచ్​ల పేర్లు కూడా ఉండాలన్నారు. జనరల్ బాడీ మీటింగ్​లో తమను కూడా ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.

ఉపసర్పంచ్​ల తగిన ప్రాధాన్యత ఇచ్చి తమని కూడా గౌరవించాలని కోరారు. రాష్ట్రంలో సర్పంచ్​ల దగ్గర కానీ, సెక్రెటరీల దగ్గర కానీ ఉపసర్పంచ్​లు ఒక్కరు కూడా కమిషన్లు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. మాకు సరైన గౌరవం దక్కేవరకు మా పోరాటం ఆగదని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో త్వరలో కేటీఆర్​ను కలవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులపై అనర్హత వేటు తీసేసి అవిశ్వాస తీర్మానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీనిపై స్టే కోసం హైకోర్టుకి కూడా వెళ్తామన్నారు.

రాష్ట్రంలో ఉపసర్పంచ్​లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి. ఉప సర్పంచుల పేరు శిలాఫలకాలపై ఉండాలి. గ్రామ పంచాయతీలో ఉపసర్పంచ్​లందరికీ అవగాహనా సదస్సు పెట్టాలి. మండల ఆఫీసుల్లో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఆహ్వానించాలి. రెండున్నర ఏళ్లుగా ఇప్పటి వరకు అవగాహన సదస్సు పెట్టలేదు. రాష్ట్రంలో ఉపసర్పంచ్​లను ఉద్దేశ పూర్వకంగా సస్పెండ్​ చేస్తున్నారు. చెక్ పవర్​పై సంతకాలు పెట్టడం లేదని వేధిస్తున్నారు. మాపై అవిశ్వాస తీర్మానం కూడా పెడుతున్నారు. దీనిపై తాము స్టే తెచ్చుకునేందురు హైకోర్టుకు వెళ్తాం. మా డిమాండ్లను సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాం.

-రాములు నాయక్, ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చూడండి:

సర్పంచ్​, ఉపసర్పంచ్​ వర్గాల మధ్య ఫైటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.