ETV Bharat / state

Bus Pass Charges hike: ప్రయాణికులకు షాక్​.. భారీగా పెరిగిన బస్​పాస్​ ఛార్జీలు

Bus Pass Charges hike: ఇటీవల రౌండ్ అప్ పేరుతో, ప్యాసింజర్ సెస్ ఛార్జీల పేరుతో టీఎస్ఆర్టీసీ ఛార్జీలను సైలెంట్​గా పెంచేసింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు బస్​పాస్​ ఛార్జీలను సైతం పెంచాలని నిర్ణయించింది. పెంచిన ఛార్జీలు ఏప్రిల్​ 1 నుంచి అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఇంధన ధరలు, ఇతర విడిభాగాల ధరలు పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనరల్, ఎన్​జీవో బస్​పాస్​ల ఛార్జీలను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.

tsrtc hikes the bus pass charges
తెలంగాణలో పెరిగిన బస్​పాస్​ ఛార్జీలు
author img

By

Published : Mar 28, 2022, 7:54 PM IST

Bus Pass Charges hike: ప్రయాణికులకు ఆర్టీసీ వరస షాకులిస్తోంది. తాజాగా బస్​పాసుల ధరను అమాంతం పెంచేసింది. పాసుల ధరలను గరిష్ఠంగా రూ.500 పెంచింది. ఈనెల 18న చిల్లర సమస్య పరిష్కారం కోసమని ఛార్జీలను రౌండప్ చేసిన ఆర్టీసీ... ఇవాళ ఉదయం ప్రయాణికుల సెస్‌ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 5 రూపాయలు.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచింది. ఆర్డినరీ బస్​పాస్‌ ధర రూ.950 నుంచి రూ.1,150కి పెంచింది. పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3,000కు పెంచింది. పెంచిన బస్​పాస్ ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు. త్వరలోనే ఆర్టీసీ టికెట్‌ ఛార్జీలు సైతం పెంచనున్నట్లు యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది.

జనరల్‌ బస్‌ టికెట్‌ పాసుల కేటగిరిలో...

  • ఆర్డినరీ బస్​పాస్‌ ఛార్జీ రూ.950 నుంచి రూ.1,150కి పెంపు
  • మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు పెంపు
  • మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కి పెంపు
  • పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంపు

ఎన్‌జీవో బస్‌పాస్‌ల కేటగిరీలో..

  • ఆర్డినరీ బస్​పాస్‌ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కి పెంపు
  • మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి పెంపు
  • మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కి పెంపు
  • ఎంఎంటీఎస్‌- ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: TSRTC CHARGES: ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో ఛార్జీల మోత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.