బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై తెరాస ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ను కలిసిన తెరాస నేతలు అరికెపూడి గాంధీ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన 10 లక్షల రూపాయలు దొరికాయని...వాటితో పాటు చేవెళ్ల అసెంబ్లీకి 10 కోట్లు, పార్లమెంట్ స్థానానికి 70 కోట్లు ఖర్చు పెట్టాలన్న వివరాలతో కూడిన పత్రాలు లభ్యమయ్యాయని వారు తెలిపారు. తన డబ్బులు కావంటూ విశ్వేశ్వర్ రెడ్డి దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెరాస నేతలు ఆక్షేపించారు.
తన సమీప బంధువు సందీప్ రెడ్డి వద్ద 10 లక్షల రూపాయలు మాత్రమే దొరికాయని స్వయంగా అంగీకరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రజత్ కుమార్ను కోరారు తెరాస నేతలు. పోలీసుల నుంచి నివేదిక తెప్పించుకొని తగు చర్యలు తీసుకుంటానని సీఈఓ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడి నుంచి 10 లక్షలు స్వాధీనం