రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు శుక్రవారం నివాళులర్పించారు. వారి చిత్రపటాల వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కిస్మత్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాజీ సైనికుడు సుధాకర్ పాల్గొని అమర జవాన్ల త్యాగాలు కొనియాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి మౌనం పాటించారు. నార్సింగిలో పుల్వామా అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి : కుమార్తెకు పెళ్లి కానుకగా ఎడ్ల బండిలో 2200 పుస్తకాలు