హైదరాబాద్ వనస్థలిపురంలోని రైతుబజార్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారస్థుల అడ్డాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో చిరు వ్యాపారస్థులు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. 20 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నామని, ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి తమ పొట్ట కొడితే ఎలా అని వ్యాపారస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు మాత్రం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పాడుతున్నందు వల్ల తొలగిస్తున్నామని చెప్పుకొచ్చారు. మున్సిపల్ అధికారులు ఇదివరకే తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి వ్యాపారాలు చేసుకోమని చెప్పారని... ఇప్పుడు పోలీసులు తొలగిస్తున్నారని తమ పరిస్థితి ఏంటని వ్యాపారస్థులు ప్రశ్నిస్తున్నారు.