రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడలో మూడు రోజుల క్రితం ఓ బాలిక అదృశ్యమైంది. 13ఏళ్ల తన కూతురు పల్లవి కనిపించడం లేదంటూ అమె తండ్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పల్లవిని తమ ఇంటికి నీళ్లు పోయడానికి వచ్చే నర్సింహులు అనే యువకుడు కిడ్నాప్ చేశాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈరోజు రాత్రివరకు పల్లవి ఆచూకీ కనిపెడతామని బాలిక అమ్మానాన్నలకు పోలీసులు భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి : చెత్తకుప్పలో పసికందు తల... మొండెం ఎక్కడ?