కరోనా వైరస్ ప్రభావంతో శానిటైజర్లు, మాస్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనివల్ల నగరంలో మాస్కుల ధరలు విపరీతంగా పెంచేసి విక్రయిస్తుండగా.. శానిటైజర్లకు కొరత ఏర్పడింది. ఈ శానిటైజర్ బాటిళ్లు చిన్నవి సైతం రూ.వందల్లో ఉంటున్నాయి. దీనివల్ల సాధారణ ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి.
ఈ పరిస్థితుల్లో ఇంట్లోనే సులువుగా శానిటైజర్ తయారు చేసుకునే విధానంపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రూ.19 తోనే 200 మి.లీ. శానిటైజర్ తయారు చేసుకునే పద్ధతిని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఫార్ములా ప్రకారం వీటిని తయారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
తమ వైద్య బృందంలోని నిపుణుల ద్వారా శానిటైజర్ తయారీ విధానం, అందులో వాడాల్సిన ద్రావణాలు, లభించే దుకాణాలను విశ్వేశ్వర్‌రెడ్డి వివరించారు. శానిటైజర్ తయారీకి వినియోగించే ద్రావణాలు నగరంలోని అబిడ్స్ తిలక్‌రోడ్‌లోని ల్యాడ్ కెమికల్స్ విక్రయించే దుకాణాల్లో లభిస్తాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ స్ప్రే బాటిళ్లు బేగంబజార్‌లో దొరుకుతాయన్నాయంటూ విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.
-
How to make your own Hand Sanitizer. WHO Formula.
— Konda Vishweshwar Reddy (@KVishReddy) March 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
మన హ్యాండ్ సానిటైజర్ మనమే తయారు చేస్కోవచ్చు pic.twitter.com/HrLApYTvz9
">How to make your own Hand Sanitizer. WHO Formula.
— Konda Vishweshwar Reddy (@KVishReddy) March 13, 2020
మన హ్యాండ్ సానిటైజర్ మనమే తయారు చేస్కోవచ్చు pic.twitter.com/HrLApYTvz9How to make your own Hand Sanitizer. WHO Formula.
— Konda Vishweshwar Reddy (@KVishReddy) March 13, 2020
మన హ్యాండ్ సానిటైజర్ మనమే తయారు చేస్కోవచ్చు pic.twitter.com/HrLApYTvz9
200 మిల్లీ లీటర్ల(మి.లీ) శానిటైజర్ చేసుకునేందుకు కావాల్సిన ద్రావణాలు
* స్వచ్ఛమైన నీరు - 90 మి.లీ.
* ఐసోప్రొపైల్ ఆల్కహాల్ - 100 మి.లీ.
* హైడ్రోజన్ పెరాక్సైడ్ - టేబుల్ స్పూన్
* గ్లిజరిన్/గ్లిజరాల్ - టేబుల్ స్పూన్
తయారీ విధానం
* ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ను శుభ్రమైన పాత్రలో తీసుకోవాలి. దీనికి టేబుల్ స్పూన్ చొప్పున గ్లిజరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపాలి. దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బాగా కలిపి.. ఖాళీ స్ప్రే బాటిల్ లేదా డిస్పెన్సింగ్ బాటిల్‌లో పోసి శానిటైజర్‌గా ఉపయోగించుకోవచ్చు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్