ETV Bharat / state

YS Sharmila Padayatra 2021: ఐదో రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర - రంగారెడ్డి జిల్లా వార్తలు

వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర(YS Sharmila Padayatra 202) ఐదో రోజుకు చేరుకుంది. ఈ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామం నుంచి ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం వరకు మహేశ్వరానికి చేరుకుంటారు.

YS Sharmila Padayatra 2021, sharmila praja prasthanam
ఐదో రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర, షర్మిల ప్రజాప్రస్థానం
author img

By

Published : Oct 24, 2021, 2:21 PM IST

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర(YS Sharmila Padayatra 202) ఐదో రోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం నుంచి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ యాత్రలో వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. పాదయాత్ర(YS Sharmila Padayatra 202) సందర్భంగా ఆమెకు వైవీ సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు.

షెడ్యూల్ ఇదే..

కొత్త తండా క్రాస్ రోడ్డు, దగ్లిగూడా క్రాస్, మానసపల్లి చౌరస్తా మీదుగా.. మానసపల్లి గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసి కాసేపు విరామం తీసుకున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మానసపల్లి నుంచి పాదయాత్ర(YS Sharmila Padayatra 202) ప్రారంభించి.. కొత్వాల్ చెరువు తండా క్రాస్, మహేశ్వరానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

నాలుగో రోజు ఇలా..

నాలుగో రోజు సందర్భంగా.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పోశెట్టిగూడ క్రాస్ రోడ్​లో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన యాత్ర.. మధ్యానానికి గొల్లపల్లి, రషీద్​గూడ, హామీదుల్లానగర్​కు చేరుకుంది. 12 గంటలకు భోజనం చేసి స్వల్ప విరామం తీసుకున్న షర్మిల.. హామీదుల్లానగర్ నుంచి చిన్నగోల్కొండ గ్రామం, బహదూర్ గూడ క్రాస్ , పెద్దగోల్కొండ, మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు.

పాదయాత్ర ఎందుకు?

తెలంగాణలో సంక్షేమ పాలన లేదని.. తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర (YS Sharmila padayatra news) మొదలుపెడుతున్నామని షర్మిల తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర 400 రోజుల పాటు 90 శాసనసభ నియోజకవర్గాల్లో 4వేల కి.మీ మేర సాగనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. వైఎస్​ఆర్ సంక్షేమ పాలన అంటే రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, రుణమాఫీ, పిల్లలకు ఉచిత విద్య పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడమే అని షర్మిల అన్నారు.

తొలిరోజు పాదయాత్ర

మొదటిరోజు మధ్యాహ్నం చేవేళ్ల మండలంలోని శంకర్​పల్లి క్రాస్​రోడ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభ అనంతరం వైఎస్ షర్మిల పాదయాత్రను విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.