ETV Bharat / state

మిద్దె సాగుతో.. ఇటు ఆరోగ్యం.. అటు మానసిక ఆనందం - Rangareddy district latest news

Terrace Farming: పట్టణాలు కాంక్రీట్​ జనారణ్యాలుగా మారిపోతున్న ఈ తరుణంలో మిద్దె తోటలకు ప్రాధాన్యం బాగా పెరిగింది. సరిగ్గా శ్రద్ధ పెట్టాలేగానీ.. మిద్దెపై పండించని పంట అంటూ ఏదీ లేదని కొందరు ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​కు మండలం కుంట్లూరుకు చెందిన జానీ.. తన ఇంటిపై సుమారు వందరకాలకు పైగా మొక్కలను పెంచుతున్నారు. తనకు కనిపించిన పాడైపోయిన ప్లాస్టిక్ డబ్బాలు బకెట్లు సీసాలలో మట్టిని నింపి .. వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయలను పెంచుతూ.. తన డాబాపైనే ఓ ఉద్యానవనాన్నే ఏర్పాటు చేశారు. సేంద్రీయ ఎరువులు ఉపయోగించి వీటిని సాగు చేస్తునట్లు చెప్పారు. ఇందుకు రూ.40వేలకు పైగా ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇటు ఆరోగ్యంతో పాటు అటు మానసిక ఆనందం పొందుతున్నాని జానీ అన్నారు.

Terrace Farming
Terrace Farming
author img

By

Published : Nov 21, 2022, 7:55 PM IST

మిద్దె సాగుతో.. ఇటు ఆరోగ్యం.. అటు మానసిక ఆనందం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.