రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది(INTER FIRST YEAR ADMISSIONS) ప్రవేశాల గడువు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 15 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆ గడువు ఈ నెల 30 వరకు ఉండగా.. దాన్ని మరో 16 రోజుల పాటు పొడిగించింది.
అంతే కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యార్థులు చేరుతున్నారు. ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల సంఖ్య లక్ష దాటింది. ఐదారేళ్లుగా ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకీ ప్రవేశాల సంఖ్య పెరుగుతుండటంతో సెప్టెంబరు 15వరకు ఇంటర్ బోర్డు.. ప్రవేశాల గడువును పొడిగించింది.
ఓ వైపు ప్రవేశాలు జరుగుతుండగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. మరో వైపు మొదటి ఏడాదికి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ నెల 16నుంచి ఇంటర్ విద్యాశాఖ ఆన్లైన్ తరగతులు ప్రారంభించింది. ఈ నెలాఖరు వరకు దూరదర్శన్లో తరగతుల షెడ్యూల్ను విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అధికారులు పాఠాలు ప్రసారం చేస్తున్నారు.
ఇదీ చదవండి: BANDI SANJAY: 'ఎంఐఎంతో తెరాసకు ఉన్న రహస్య ఒప్పందమేంటి?'