రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసు నిందితుడు సురేష్.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండగా వైద్యులు వెంటిలెటర్‌పై చికిత్స అందించారు. నిన్న మధ్యాహ్నం పరిస్థితి విషమించి సురేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లిలో భారీ బందోబస్తు నడుమ ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదీ చదవండిః తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి