రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. వీరికి ఎస్ఎఫ్ఐ మద్దతు తెలిపింది. విద్యార్థులతో కలిసి డిపో ముందు సంఘం నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
43 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు సరైన బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఇంట్లోనే దీక్ష ప్రారంభించిన అశ్వత్థామ రెడ్డి