ETV Bharat / state

బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు - Rangareddy District_Chevella mandal

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్టాండ్​లో బస్సుల కోసం విద్యార్థులు ఆందోళన చేశారు. ఆర్డినరీ బస్సులను ఎక్స్​ప్రెస్​లుగా నడపడం వల్ల విద్యాసంస్థలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Students_Agitation
Students_Agitation
author img

By

Published : Feb 7, 2020, 2:42 PM IST

విద్యాసంస్థలకు వెళ్లేందుకు ఆర్డినరీ బస్సులు లేవని... సమస్యను డీఎంకు చెప్తే ఇష్టానుసారంగా మాట్లాడారని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్టాండ్​లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బస్టాండ్ బయటకు బస్సులు రాకుండా రాళ్లు అడ్డుపెట్టారు.

వికారాబాద్ డిపో బస్సుల్లో చేవెళ్ల మీదుగా నగరానికి రాకపోకలు సాగిస్తారు. ఉన్న కొద్దిపాటి ఆర్డినరీ బస్సులను ఎక్స్​ప్రెస్​లుగా మార్చడం వల్ల అవసరమైన బస్సులు లేక కళాశాలలకు ఆలస్యంగా వెళ్తున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని వికారాబాద్​ డీఎంకు చెప్తే నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్​కు వచ్చి విద్యార్థులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.

బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ఇదీ చూడండి : శరీరంపై పెయింటింగ్​ వేసుకుని ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.