ETV Bharat / state

'రాచకొండ పరిధిలో అకారణంగా రోడ్డెక్కితే కేసులు తప్పవు'

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనదారులు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. ఇకపై అకారణంగా రోడ్డెక్కే వాహనదారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నారు.

'నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తాం'

author img

By

Published : Apr 9, 2020, 5:23 PM IST

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. అకారణంగా రోడ్లపైకి వస్తున్న వారిని కట్టడి చేస్తున్నారు. అత్యవసరమైన పనుల ఉంటే తప్ప బయటకు రాకూడదని ఉన్నతాధికారులు సూచనలు చేసినా కొందరు పాటించట్లేదు. అటువంటి వారిపై కొరడా ఝళిపిస్తున్నారు.

33 చెక్ పోస్టులు...43,339 కేసులు

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 33 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ దివ్య చరణ్‌ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటి వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘనలపై 43,339 కేసులు నమోదు అయ్యాయి. 2439 వాహనాలు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి : ప్రపంచవ్యాప్తంగా 15లక్షలు దాటిన కరోనా కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.