కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. కాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోనే ఇద్దరు వాహనదారులు నిర్లక్ష్యంగా రోడ్డుపైనే ఉమ్మి వేస్తూ పోలీసులుకు అడ్డంగా దొరికిపోయారు.
కొత్తగూడెం చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంకు చెందిన ఎస్కే. హాజీ పాషా, మీర్ జహంగీర్ బాధ్యతారాహిత్యంగా రోడ్డుపై ఉమ్మి వేశారు. ఇది గమనించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం