రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభించటంపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, సంఘాలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో రెండుమూడు రోజుల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు. వారి అభిప్రాయాలను తీసుకొని మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించాలని భావిస్తున్నారు. గత విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం జూన్ 12న బడులను తెరవాల్సి ఉంది.
వారంలో ఎన్‌సీఈఆర్‌టీ టాస్క్‌ఫోర్స్ మార్గదర్శకాలు
కరోనా నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలల పునఃప్రారంభం, పాటించాల్సిన మార్గదర్శకాలు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ గత నెలలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. అది మరో కరోనా నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలల పునఃప్రారంభం, పాటించాల్సిన మార్గదర్శకాలు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ గత నెలలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. అది మరో వారంలో నివేదిక సమర్పించనుంది.
జులైలో తెరిచేందుకు..
జులైలో బడులు పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొదట గ్రీన్, ఆరెంజ్ జోన్లలో 8వ తరగతిని, తర్వాత దశలో 1-7 తరగతులను ప్రారంభించాలని యోచిస్తోంది. భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున షిఫ్టు విధానంలో తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఉపాధ్యాయులతో నిర్వహించిన వెబినార్‌లో 30 శాతం హాజరుతో షిఫ్టు విధానంలో తరగతులు జరుగుతాయని పేర్కొన్నట్లు చెబుతున్నారు.