ETV Bharat / sports

WPL 2025 రిటెన్షన్‌- ఆర్సీబీ, ముంబయి స్ట్రాంగ్​- ఏ జట్టు ఎవరిని రిటైన్‌ చేసుకుందంటే? - WPL RETENTION 2025 LIST

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకుంటున్న ప్లేయర్ల జాబితా రిలీజ్

WPL Retention 2025 List
WPL Retention 2025 List (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 7:46 PM IST

WPL Retention 2025 List : మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌ వచ్చే ఏడాది జరగనుంది. అంతకంటే ముందు వేలం నిర్వహించనున్నారు. దీంతో ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి నవంబర్ 7 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. ఆ గడువు ముగియడం వల్ల ఏ జట్టు ఎవరిని రిటైన్‌ చేసుకుంది, ఎవరిని వదిలేసింది అనే వివరాలను వెల్లడించారు. వేలంలో ఒక్కో ఫ్రాంఛైజీ రూ.15 కోట్లు ఖర్చు పెట్టడానికి అనుమతి ఇచ్చారు. వేలం ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ఏ జట్టు ఎవరిని రిటైన్‌ చేసుకుందంటే?

స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ వంటి టాప్‌ ప్లేయర్లను సంబంధిత ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకున్నాయి. గడువు ముగుస్తుందనగా డానియెల్ వ్యాట్-హాడ్జ్‌ని యూపీ వారియర్స్‌ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. 2024 WPL విన్నర్‌ ఆర్సీబీ వద్ద ఏకంగా 14 మంది ప్లేయర్లు ఉన్నారు. రానున్న సీజన్‌లో కూడా స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనుంది. గత సీజన్‌లో అత్యుత్తమంగా రాణించిన రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, సోఫీ డివైన్‌ని ఆర్సీబీ అట్టిపెట్టుకుంది. మరోవైపు ముంబయి ఇండియన్స్‌ కోర్‌ టీమ్‌ను వదులుకోలేదు. కానీ తొలి సీజన్‌లో హ్యాట్రిక్‌ సాధించి వార్తల్లో నిలిచిన ఇంగ్లండ్‌ ప్లేయర్‌ ఇస్సీ వాంగ్‌ను పక్కనపెట్టి ఆశ్చర్యపరిచింది. రాబోయే సీజన్‌కు ముంబయి వద్ద కూడా 14 మంది ప్లేయర్లు ఉన్నారు.

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    రిటైన్‌ చేసిన ప్లేయర్లు: స్మృతి మంధాన, ఎస్ మేఘన, రిచా ఘోష్, ఎలీస్ పెర్రీ, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా, డాని-వ్యాట్ (యూపీ వారియర్స్‌ నుంచి ట్రేడ్)
    రిలీజ్‌ చేసిన ప్లేయర్లు: దిశా కసత్, ఇంద్రాణి రాయ్, నదీన్ డి క్లర్క్, శుభా సతీష్, శ్రద్ధా పోకర్కర్, సిమ్రాన్ బహదూర్, హీథర్ నైట్
    పర్సులో ఉన్న అమౌంట్‌: రూ. 3.15 కోట్లు
  • ముంబయి ఇండియన్స్
    రిటైన్‌ చేసిన ప్లేయర్లు: అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, జింతిమణి కలిత, నాట్ సివర్‌, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణన్
    రిలీజ్‌ చేసిన ప్లేయర్లు: ప్రియాంక బాలా, హుమైరా కాజీ, ఫాతిమా జాఫర్, ఇసాబెల్లె వాంగ్
    పర్సులో ఉన్న అమౌంట్‌: రూ.2.65 కోట్లు
  • దిల్లీ క్యాపిటల్స్‌
    రిటైన్‌ చేసిన ప్లేయర్లు: అలిస్ క్యాప్సే, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజెన్ కాప్, మెగ్ లానింగ్ (కెప్టెన్), మిన్ను మణి, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్
    రిలీజ్‌ చేసిన ప్లేయర్లు: లారా హారిస్, అశ్వనీ కుమారి, పూనమ్ యాదవ్, అపర్ణ మోండల్
    పర్సులో ఉన్న అమౌంట్‌: రూ. 2.5 కోట్లు
  • గుజరాత్ జెయింట్స్
    రిటైన్‌ చేసిన ప్లేయర్లు: ఆష్లీ గార్డ్‌నర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్‌గారే
    రిలీజ్‌ చేసిన ప్లేయర్లు: స్నేహ రాణా, క్యాథరిన్ బ్రైస్, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, ట్రానమ్ పఠాన్, లీ తహుహు
    పర్సులో ఉన్న అమౌంట్‌: రూ.4.4 కోట్లు
  • యూపీ వారియర్స్‌
    రిటైన్‌ చేసిన ప్లేయర్లు: అలిస్సా హీలీ, అంజలి శర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి ఆటపట్టు, రాజేశ్వరి గైక్వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎకిల్‌స్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, తహ్లియా మెక్‌గ్రాత్, వృందా దినేష్, పూనమ్ ఖేమ్నార్, సైమా ఠాకూర్, గౌహెర్ సుల్తానా.
    రిలీజ్‌ చేసిన ప్లేయర్లు: లక్ష్మీ యాదవ్, పార్షవి చోప్రా, ఎస్ యశశ్రీ, లారెన్ బెల్
    పర్సులో ఉన్న అమౌంట్‌: రూ.3.9 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.