ETV Bharat / state

పీజీ మెడికల్ సీట్ల కేటాయింపు స్కాంలో 'మల్లారెడ్డి'! - బ్యాంక్ అకౌంట్లు తనిఖీ చేసిన ఈడీ - ED OFFICERS ON MALLA REDDY COLLEGE

పీజీ మెడికల్ సీట్ల అక్రమాల కేసులో ఈడీ విచారణ - ఈడీ విచారణకు మల్లారెడ్డి వైద్యకళాశాల అధికారి సురేందర్‌రెడ్డి హాజరు - సీట్ల బ్లాకింగ్ వ్యవహారంపై ఆరా

MALLA REDDY ON MEDICAL SCAM
ED Officers on Malla Reddy College for Medical Seats Scam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 7:28 PM IST

ED Officers on Malla Reddy College for Medical Seats Scam : మెడికల్ పీజీ సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద విక్రయించుకొని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి సురేందర్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. సీట్ల బ్లాకింగ్ వ్యవహారంపై ప్రశ్నించారు. పీజీ సీట్ల కేటాయింపు రికార్డులు తెప్పించుకుని పరిశీలించిన అధికారులు, తరువాత కళాశాల బ్యాంకు స్టేట్‌మెంట్లను తనిఖీ చేశారు. కాగా కొందరు వ్యక్తులు, ఏజెన్సీలు నీట్ విద్యార్థులతో కలిసి తెలంగాణాలోని పలు ప్రైవేటు మెడికల్ కళాశాల్లోని పీజీ సీట్లను బ్లాక్ చేస్తున్నారని, తెలంగాణాలోని పీజీ మెడికల్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించే కాళోజీ నారాయణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వరంగల్ మట్టెవాడ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఈ కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. నీట్​లో అత్యధిక మార్కులు సాధిందిన వారితో కొన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తమ కాలేజీల్లో సీట్​ను ఎంచుకున్నట్లు సృష్టించి, అడ్మిషన్ చివరి రోజు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలా మిగిలి పోయిన సీట్లను ఇస్టిట్యూషనల్ కోటా కింద కోటి నుంచి 2.5 కోట్లకు విక్రయించుకున్నట్లు ఈడీ గుర్తించింది. అయితే సీట్లను రద్దు చేసుకున్నందుకు కట్టాల్సిన రూ.5 లక్షల నష్టపరిహారాన్ని విద్యార్థుల పేరు మీద ఏజెన్సీలు కట్టేసినట్లు ఈడీ గుర్తించింది.

మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో రూ.1.4 కోట్లు స్వాధీనం : ఈ వ్యవహరంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ఈడీ హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ సహా మొత్తం 16 చోట్ల రెండు రోజుల పాటు సోదాలు చేసింది. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజ్‌లు, నగదు లావాదేవీలు, పీజీ, ఎంబీబీఎస్‌ విద్యార్ధులు ఫీజుల కట్టిన వివరాలు సేకరించింది. సోదాల్లో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో రూ.1.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. పీజీ అడ్మిషన్లకు సంబంధించి అనుమానాస్పదంగా కనిపించిన మల్లారెడ్డి కళాశాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని 2.89 కోట్ల రూపాయలను నిలుపుదల చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపింది.

మల్లారెడ్డికి బిగ్​షాక్​ - 'యూనివర్సిటీ ఆఫ్​ క్యాంపస్​'పై హైకోర్టు కీలక ఆదేశాలు - TELANGANA HC ON MALLAREDDY UNI

మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ విచారణ.. సీట్ల కేటాయింపుపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.