వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలోని ప్రభుత్వ గ్రంథాలయ ఆవరణలో రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ్య వద్ద ఆండ్ర సాంబమూర్తి స్మారక చతుర్థ ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన జరిగింది.
సత్యహరిశ్చంద్రుడిగా డాక్టర్ సీహెచ్ శూలపాణి, శివుడిగా సీహెచ్ వి.ఆర్.కె. మూర్తి, చంద్రమతిగా సురభి జ్యోతి నటించి ఎంతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వనస్థలిపురంలోని పలు కాలనీల వాసులు హాజరై నాటకాన్ని తిలకించారు.
ఇదీ చూడండి: 'వామనరావు తల్లిదండ్రులకు ప్రాణభయం ఉందని చెప్పారు'