హైదరాబాద్ నారాయణగూడలో.. రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీకి రాష్ట్ర సర్పంచ్ల సంఘం గౌరవాధ్యక్షుడు సౌదని భూమన్న యాదవ్ హాజరయ్యారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల ఉమ్మడి చెక్‌పవర్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరితో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఏకగ్రీవమైన సర్పంచ్‌లకు ప్రకటించిన నజరానాను వెంటనే విడుదల చేయాలన్నారు. సర్పంచ్ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి 20 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్లపై ప్రభుత్వ సానుకూలంగా స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఆ నాలుగు అంశాలపైనే చర్చించాం : భట్టి విక్రమార్క