ETV Bharat / state

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

author img

By

Published : Dec 4, 2022, 2:25 PM IST

Updated : Dec 4, 2022, 3:34 PM IST

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

14:23 December 04

Road accident in rangareddy district: రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గర్తు తెలియని డీసీఎం వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో.. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం మహబూబ్​నగర్ జిల్లా షాద్​నగర్ మండలం కడియాల కుంట తండాకు చెందిన గోపాల్ నాయక్(47), అంజలి( 42), స్వాతి(9) ఈ ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని డీసీఎం వాహనం వారిని బలంగా ఢీ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

అదే రహదారిపై అర్ధగంట ముందు సీఎం కేసీఆర్ వెళ్లడంతో రోడ్డంతా ట్రాఫిక్ మయమైంది. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 4, 2022, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.