ఆధునిక పద్ధతులు, కొత్త రకం విత్తనాలతో సాగుచేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని నిరూపించారు రైతు జగదీశ్వర్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి ఈయన రెండెకరాల పొలంలో కదిరి లేపాక్షి 1812 రకానికి చెందిన 90 కిలోల వేరుసెనగ విత్తనాలను నాటారు. ఈ తరహా విత్తులకు తెగుళ్లను తట్టుకొనే సామర్థ్యం ఉందని తెలిపారు.
జగదీశ్వర్ సాగుచేసిన పంటలో ఒక మొక్కకు అనూహ్యంగా సుమారు 200 కాయలు వచ్చాయి. సాధారణంగా మొక్కకు 100 లోపే కాయలు వస్తాయని, రెండెకరాల్లో 38 క్వింటాళ్ల దిగుబడి రావటం ఆనందంగా ఉందని రైతు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నేటి నుంచి కరోనా టీకా మొదటి డోసు నిలిపివేత