రంగారెడ్డి జిల్లా సహకార బ్యాంకు లిమిటెడ్ ఛైర్మన్‌గా మనోహర్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా సత్తయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. హైద్రాబాద్ నాంపల్లి బ్యాంకు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో పరిగి ఎమ్మెల్యే మహేష్ సమక్షంలో.. ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి ధ్రువ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్లకు ఎమ్మెల్యే, జిల్లా నాయకులు పూలదండలు వేసి ఘనంగా సన్మానించారు.
ఇవీ చూడండి: తెలంగాణ పన్ను రాబడుల్లో 4 శాతం వృద్ధి!