ETV Bharat / state

నవీన్ హత్య కేసు.. హరిహరకృష్ణ కస్టడీపై కీలక తీర్పు ఇచ్చిన కోర్టు - హరిహరకృష్ణకు పోలీసు కస్టడీ

Court Allows One Week Custody to Hariharakrishna: అబ్దుల్లాపూర్​మెట్​లో జరిగిన హత్య కేసులో నిందితుడు అయిన హరిహరకృష్ణను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్​పై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారం రోజుల పాటు హరిహరికృష్ణకు కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా పరిశీలించనున్నారు.

Naveen Murder Case
Naveen Murder Case
author img

By

Published : Mar 2, 2023, 3:39 PM IST

Updated : Mar 2, 2023, 5:12 PM IST

Court Allows One Week Custody to Hariharakrishna: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్​మెట్​లోని నవీన్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. నిందితుడు హరిహరకృష్ణను కస్టడీకి ఇవ్వాలని అబ్దుల్లాపూర్​మెట్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీన్ రీకన్​స్ట్రక్షన్ చేస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు కోర్టుకు వివరించారు. అయితే తాజాగా ఆ పిటిషన్​పై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

ఇంజినీరింగ్‌ విద్యార్థి నవీన్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడు హరిహరకృష్ణను కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. వారంరోజుల పాటు హరిహరకృష్ణకు పోలీసు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుతో హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా ప్రశ్నించనున్నారు. తన ప్రేమకు అడ్డువస్తున్నాడని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నిన హరిహరకృష్ణ స్నేహితుడు అనే కనికరం కూడా లేకుండా నవీన్​ను అత్యంత పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్యకేసులో నిందితుడు అయిన హరిహరకృష్ణ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండు ఖైదీగా ఉన్నాడు.

నిందితుడు హరిహరకృష్ణ నుంచి నవీన్​ హత్యకు సంబంధించిన మరిన్ని కీలక వివరాల రాబట్టేందుకు, సీన్ రీకనస్ట్రక్షన్ కోసం అతడు వాడిన వస్తువుల స్వాధీనానికి కస్టడీకి ఇవ్వాలని వనస్థలిపురం ఏసీపీ... రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరిహరకృష్ణను 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ అక్కడే చాలా సేవు ఉండి ఆధారాలు చెరిపివేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు కోర్టుకు వివరించారు. నవీన్ చరవాణిని ధ్వంసం చేసి ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని పొదల్లో పడేశాడని... ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై చాలాచోట్లకు తిరిగాడని పేర్కొన్నారు. పోలీసుల తరఫున అదనపు పీపీ ప్రతాప్​రెడ్డి వాదనలు వినిపించారు.

వాదనలు విన్న అనంతరం కోర్టు.. నిందితుడు హరిహరకృష్ణకు వారం రోజుల పాటు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా పరిశీలించనున్నారు. నిందితుడి పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత.. ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్​ కోర్టు ద్వారా నవీన్ హత్యకేసు విచారణ త్వరగా ముగిసేలా చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 2, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.