రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి దూసుకొచ్చాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద భద్రతా వలయాన్ని ఛేదించుకుని మెరుపు వేగంతో వెళ్లి రాహుల్ కాళ్లను పట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆ గుర్తు తెలియని వ్యక్తిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరిపై ఆగ్రహించిన రాహుల్.. వారిపై నిస్సహాయతను వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర మంగళవారం ఆరాంఘర్ మీదుగా నగరంలోకి అడుగుపెట్టనుంది.
అయితే దీనికి పోలీసుల వైఫల్యమే కారణమంటూ వస్తున్న వార్తలపై డీసీపీ సందీప్ స్పందించారు. అందులో ఎలాంటి భద్రతా లోపం లేదని చెప్పారు. ఆ సంఘటనలోని ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని తెలిపారు. రాహుల్ గాంధే వారిని రమ్మని పిలిచారని అక్కడ ఉన్న పోలీసులు.. తనిఖీ చేసిన తర్వాతే వారికి అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. ఆ ఇద్దరు రాహుల్ పాదాలను తాకేెందుకు ప్రయత్నించారని అన్నారు. కానీ రాహుల్ గాంధీ వద్దని వారించి.. ఆ ఇరువురితో ఫొటో తీసుకొని పంపించి వేశారని డీసీపీ సందీప్ వెల్లడించారు.
ఇవీ చదవండి: 'తెరాసతో పొత్తు ప్రసక్తే లేదు.. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ మోదీ నాశనం చేశారు'
106+ ఏజ్‌లో మళ్లీ ఓటు వేసేందుకు సిద్ధం.. పోలింగ్ బూత్‌లో రెడ్ కార్పెట్ వెల్కమ్