రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ పరిధిలోని తెరాస స్థానిక కమిటీలు, సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలంటే కేవలం తెరాసతోనే సాధ్యమని అన్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : వీడియోకాల్ ద్వారా పల్లె ప్రగతి పనుల పరిశీలన