ముందస్తు సంక్రాంతి సంబరాలతో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో సందడి వాతావరణం నెలకొంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు తెలుగు వారి సంక్రాంతి వైభవం తెలిసేలా ఫిల్మ్‌సిటీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
డూడూ బసవన్నలు చేసే ఆటలు చూసి పర్యాటకులు సైతం మురిసిపోయారు. గంగిరెద్దులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. గంగిరెద్దులతో సంక్రాంతి వైభవం చాటేలా.. మన తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఫిల్మ్ సిటీ యాజమాన్యం వేడుకలు నిర్వహించింది.