ETV Bharat / state

వివాహితపై ఇన్‌స్పెక్టర్‌ అత్యాచారం.. రిమాండ్​ రిపోర్టులో విస్తుపోయే నిజాలు

author img

By

Published : Jul 13, 2022, 5:36 PM IST

Updated : Jul 13, 2022, 7:00 PM IST

Nageswararao case: మాజీ ఇన్​స్పెక్టర్ నాగేశ్వరరావు కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించినట్లు ఏసీపీ తెలిపారు. వివాహితపై అత్యాచారం కేసులో నేరాన్ని అంగీకరించినట్లు వనస్థలిపురం పోలీసులు వెల్లడించారు.

Nageswararao case
Nageswararao case

Nageswararao case: అత్యాచారం, అపహరణ కేసులో వనస్థలిపురం పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మాజీ ఇన్​స్పెక్టర్​ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో విస్తుగొలిపే అంశాలను వెల్లడించారు. దర్యాప్తులో నాగేశ్వరరావు నేరాన్ని ఒప్పుకున్నట్లు వనస్థలిపురం ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసు రిమాండ్‌ రిపోర్టులో విస్తుపోయే అంశాలను పోలీసులు వెల్లడించారు. అత్యాచారం, అపహరణ కేసు నమోదు చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించిన్నట్లు పేర్కొన్నారు.

రిమాండ్​ రిపోర్టులో విస్తుపోయే అంశాలు: వివాహిత కణితపై తుపాకి గురిపెట్టి అత్యాచారం చేసిన మాజీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరావు కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.అత్యాచారం, అపహరణ, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద ఆయనపై వనస్థలిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిన గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. నాగేశ్వరరావును బాధితురాలి భర్త కొట్టిన కర్ర, అత్యాచార సమయంలో బాధితురాలి దుస్తులు స్వాధీనం చేసుకుని వాటిని ఎఫ్ఎస్‌ఎల్‌కి పంపించినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు, ఆమె భర్తను కారులో తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు.

బెంగళూరు పారిపోయిన నాగేశ్వరరావు: కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలి ఇంటి వద్ద ఓ ఎలక్ట్రిక్ దుకాణం సీసీ ఫుటేజీ సేకరించామని పోలీసులు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో సీసీ కెమెరాల్లో నాగేశ్వరావు కారు గుర్తించినట్లు పేర్కొన్నారు. కారు వనస్థలిపురం నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్నామని.. బాధితురాలి సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.

హోంగార్టు వాంగ్మూలం నమోదు: కారుకు ఇబ్రహీంపట్నం వద్ద ప్రమాదం జరిగిందని హోంగార్డుకు నాగేశ్వరరావు సమాచారం ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే కారును ట్రోయింగ్ వాహనం ద్వారా చంపాపేట్‌కు తరలించినట్లు గుర్తించారు. హోంగార్డు ప్రవీణ్ స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశామని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం తర్వాత మారేడ్‌పల్లి పీఎస్‌లో విధులు నిర్వహించారని.. కేసు నమోదైందని తెలిసిన తర్వాత బెంగళూరు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

అత్యాచారం ఘటన తర్వాత నాగేశ్వరరావు తన బట్టలు స్వయంగా ఉతుక్కున్నాడని, ఏమీ తెలియనట్టు మారేడ్‌పల్లి పీఎస్‌కు వెళ్లి విధులు నిర్వహించినట్ట పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని మారేడ్‌పల్లి ఠాణాలోనే రివాల్వర్‌ ఉంచి బెంగళూరుకు పరారయ్యాడు. కొత్తపేటలోని గ్రీన్‌ హిల్స్‌ కాలనీలో అతని నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు... అత్యాచార సమయంలో వాడిన ప్యాంటు, షర్టు, లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కొవిడ్‌, లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన అనంతరం హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు

అసలేం జరిగిందింటే: ఈ నెల 6న వివాహితపై అత్యాచారం చేసి, బాధితురాలితో పాటు ఆమె భర్తను బలవంతంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఎల్మినేడుకు కారులో తీసుకెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న నాగేశ్వరరావు భుజానికి గాయం కావడంతో బాధిత దంపతులిద్దరూ తప్పించుకొని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దురాగతం బయటపడింది. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఇన్​స్పెక్టర్​ను సస్పెండ్‌ చేశారు. ప్రమాదంలో గాయపడిన ఇన్​స్పెక్టర్ తొలుత అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాధితులతో మాట్లాడి రాజీ కుదుర్చుకునేందుకు యత్నించాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆయనను పట్టుకొనేందుకు మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే ఎస్​వోటీ పోలీసులు నేడు నాగేశ్వరరావును అరెస్ట్​ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 13, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.